భక్త ఆంజనేయ స్వామిని గురువారం పూజిస్తే..?
ఆంజనేయ స్వామిని వివిధ రూపాల్లో పూజించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. ఆంజనేయ స్వామిని గురువారం పూట పూజించడం ద్వారా ధైర్యం, మానసిక ఉల్లాసం చేకూరుతుంది. అనుకున్న కార్యాల్లో దిగ్విజయం చేకూరుతుంది. ఆంజనేయ స్వామి శివుని అంశం. శివ అంశగానే ఆయన్ని భావిస్తారు. అలాగే వివిధ రూపాల్లో ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా ఈతిబాధలుండవు.
ఆంజనేయ రూపాల్లో వీర ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా ధైర్యం చేకూరుతుంది. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే తాంత్రిక ఇబ్బందులు వుండవు. కష్టాలు తొలగిపోతాయి.
యోగ ఆంజనేయ స్వామిని కొలిస్తే.. మానసిక ప్రశాంతత, మనోధైర్యం చేకూరుతుంది. భక్త ఆంజనేయ స్వామిని పూజిస్తే.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. సంజీవి ఆంజనేయ స్వామిని పూజిస్తే.. వ్యాధులు తొలగిపోతాయి.