ధనాన్ని వృధా చేస్తే ఆమెకు కోపం వస్తుందట..?

Lakshmi Kubera swamy
Lakshmi Kubera swamy
సెల్వి| Last Updated: శనివారం, 30 జనవరి 2021 (20:33 IST)
శ్రీలక్ష్మిని పూజిస్తే సకలసంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అయితే ద్రవ్యాన్ని అంటే డబ్బును విచ్చలవిడిగా వ్యయం చేస్తే.. శ్రీ మహాలక్ష్మికి నచ్చదని.. కోపం వస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

లక్ష్మీదేవిని పూజిస్తే సుఖశాంతులు లభిస్తాయి. పెద్దగా వ్రతాలు, కఠిన దీక్షలు చెయ్యకపోయినా... మనసులో ధ్యానిస్తే అమ్మవారు కరుణిస్తారని అంటున్నారు. ఐతే... అమ్మవారిని పూజిస్తూ... ఇక ధనం వస్తుందిలే అని నిర్లక్ష్యంగా డబ్బును ఖర్చు చేస్తే మాత్రం అమ్మవారికి కోపం వస్తుందట.

అందువల్ల ధనలక్ష్మిని ప్రేమించాలనీ, ధనాన్ని వృధా చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఎవరైతే డబ్బును ప్రేమిస్తూ... నిజాయితీగా వ్యవహరిస్తూ అమ్మవారిని పూజిస్తారో, వారిని లక్ష్మీదేవి కటాక్షిస్తుందట. అలాగే లక్ష్మీ కుబేర పూజతో ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవచ్చునట. పురాణాల ప్రకారం.. ఈ ఆర్థిక సమస్యలకు ఓ పరిష్కారం ఉంది. అదే కుబేర ధన మంత్రం. ఎవరికైనా ఆర్థిక సమస్యలు వచ్చినా కుబేర మంత్రాన్ని జపించమని సూచిస్తున్నారు.

కుబేరుడు అంటే సంపదకు దేవుడు. మీరు కుబేర స్వామిపై నమ్మకంతో మంత్రాన్ని జపిస్తూ ఉంటే... ఆటోమేటిక్‌గా ఆర్థిక సమస్యలు తగ్గిపోతూ... చివరకు పూర్తిగా పోతాయట. ఈ మంత్రం జపించేటప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. ఓ వైపు మంత్రాన్ని జపిస్తూ మరోవైపు పరమేశ్వరుడికి పూజలు చేయాలని పండితులు సూచిస్తున్నారు. తద్వారా చాలా త్వరగానే ఆర్థిక సమస్యలు తొలగుతాయంటున్నారు.

కుబేర ధన మంత్రం: ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః అనే ఈ చిన్న మంత్రాన్ని జపిస్తూ వుంటే.. కోరిన కోరికలు నెరవేరుతాయి. అంతేగాకుండా కుబేర గాయత్రిని 21 రోజుల పాటు పఠించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :