సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

12 రాశులు.. తమలపాకుల పూజ.. ఏ రోజు చేయాలి?

తమలపాకులు ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికపరంగా మేలు చేస్తాయి. తమలపాకుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం వుంటుంది. అన్నీ శుభకార్యాల్లో తమలపాకులను వాడుతూ వుంటాం. ఈ తమలపాకులతో ఏ రోజు పూజ చేస్తే 12 రాశుల వారికి కలిగే శుభ ఫలితాలేంటో చూద్దాం.. 
 
మేషం: ఈ రాశిలో జన్మించిన జాతకులు సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన మంగళవారం పూట... పూజకు రెండు తమలపాకులను వుంచి దానిపై మామిడి పండును సమర్పించి పూజించాలి.
 
వృషభం: వృషభ రాశి జాతకులు రాహు భగవానుడికి మంగళవారం పూట ఆలయానికి వెళ్లి రెండు తమలపాకులను వుంచి దానిపై 9 మిరియాలను వుంచి పూజించాలి.
 
మిథునరాశి: మిథునరాశి జాతకులు బుధవారం పూట ఇంటి దేవతకు రెండు తమలపాకులు, అరటి పండ్లు రెండింటిని వుంచి పూజించడం ద్వారా కష్టాలు తొలగిపోతాయి. ఈ తమలపాకులు, అరటి పండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. 
 
కర్కాటకరాశిలో జన్మించిన జాతకులు శుక్రవారం కాళికామాత గుడికి వెళ్లి రెండు తమలపాకులు, దానిమ్మ పండ్లను వుంచి పూజిస్తే.. వాటిని ప్రసాదంగా సేవిస్తే మంచి ఫలితం వుంటుంది. 
 
సింహ రాశి జాతకులు.. గురువారం పూట ఇష్టదేవతా పూజకు సర్వం సిద్ధం చేసుకుని.. ఆ దేవతా పటం ముందు రెండు తమలపాకులను అరటి పండ్లను వుంచి పూజించాలి. ఆ అరటి పండ్లు, తమలపాకులను సేవించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. 
Astrology
 
కన్యారాశి : కన్యారాశి జాతకులు గురువారం పూట ఇష్టదేవతా పూజ చేసి రెండు తమలపాకుల్లో 27 మిరియాలను సమర్పించాలి. ఇలా చేస్తే రుణాల బాధలుండవు. పూజకు తర్వాత తమలపాకులను, మిరియాలను తీసుకోవడం ద్వారా ఈతిబాధలు తొలగి, కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. 
 
తులారాశి: ఈ రాశి జాతకులు శుక్రవారం పూట ఇంటి దేవతను పూజించి రెండు తమలపాకులు, లవంగాలను వుంచి తర్వాత దానిని తీసుకుంటే సమస్యలు తొలగిపోతాయి. 
 
 
వృశ్చికం: ఈ రాశి వారు మంగళవారాల్లో దుర్గమ్మతల్లికి రెండు తమలపాకులు, ఖర్జూరాలు వుంచి పూజ చేయాలి. ఆపై దానిని ప్రసాదంగా స్వీకరించాలి. 
 
ధనుస్సు : ఈ జాతకులు గురువారం పూట కుమార స్వామికి తమలపాకులు రెండింటిని వుంచి.. కలకండను కాసింత వుంచి పూజించాలి. ఇలా చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. ప్రశాంతత చేకూరుతుంది. 
 
మకర రాశి: మకర రాశి జాతకులు శనివారం పూట కాళికాదేవిని పూజించి.. రెండు తమలపాకులు, బెల్లం వుంచి పూజించాలి. ఆపై దానిని ఇంటికి తెచ్చుకుని ప్రసాదంగా స్వీకరించాలి. 
 
కుంభరాశి జాతకులు శనివారం పూట కాళికి పూజ చేసి రెండు తమలపాకులను, అరస్పూన్ నెయ్యిని సమర్పించి పూజించాలి. దానిని  ప్రసాదంగా తీసుకోవాలి. 
 
మీనం: మీన రాశి జాతకులు ఇష్ట దైవాన్ని పూజించి..తమలపాకులు రెండింటిని వుంచి కాసింత పంచదారను సమర్పించాలి. పూజకు అనంతరం తమలపాకును, పంచదారను ప్రసాదంగా స్వీకరించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.