దేవుడి పూజలో కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచిదా? కాదా?
పూజల్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొన్నిసార్లు కుళ్లిపోయినది అగుపిస్తుంది. ఇలా కొబ్బరికాయ కుళ్లిపోయింది చూడగానే ఆదుర్దా పడిపోతారు. వాస్తవానికి పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమేమికాదని అంటున్నారు జ్యోతిష నిపుణులు.
ఇది మనం తెలిసి చేసిన పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదే కాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం.
అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినాసరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి.