Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

భాద్రపద ఏకాదశి.. శ్రీహరిని పూజిస్తే.. శుభవార్తలు వింటారు..

Written By సెల్వి
Updated: మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (10:15 IST)
భాద్రపద శుక్ల ఏకాదశి నేడు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే మహావిష్ణువు భాద్రపద శుక్ల ఏకాదశి నాడు పక్కకు తిరుగుతాడు. అంటే ఇది పరివర్తన. ఈ రోజున శ్రీహరిని పూజించడం వల్ల వ్యక్తుల్లో పరివర్తన చోటుచేసుకోవడమే కాదు, అత్యంత ప్రయోజనం కలుగుతుంది. 
 
ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. ఈ ఏకాదశి నాడు శ్రీహరిని పూజిస్తే తీరని కోరికలు నెరవేరతాయని పురాణాలు చెప్తున్నాయి. 
 
భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకు పసుపు వస్త్రంతోపాటు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించడం వల్ల మనసులోని కోరికలు నెరవేరతాయి. విష్ణువుతోపాటు లక్ష్మీదేవి, వినాయకుడిని పూజిస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది. నిరుపేదలకు పసుపు రంగు వస్త్రాలను దానం చేస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు పూర్తవుతాయి.
 
ఇకపోతే.. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కోంటారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ కాలంలోనే చాతుర్మాస దీక్షను చేపడతారు. ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాల్లో ఈ దీక్ష సాగుతుంది.

అన్నీ చూడండి

సింగపూర్ తరహా వ్యవసాయ విధానం కావాలి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Mantralayam: మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. మహిళ మృతదేహాన్ని కిలోమీటర్ మోసుకెళ్లి..? (video)

రాజీనామా చేసేలా చేస్తాం : సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు రాహుల్ హెచ్చరిక

బంగారు గొలుసు చోరీ కేసు : యూట్యూబర్ మధుమితకు సమన్లు

Chandra Babu Naidu: స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ట్రిపుల్-ఇంజిన్ సర్కార్.. చంద్రబాబు

అన్నీ చూడండి

12-10-2026 సోమవారం రాశిఫలాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పందెపు పోటీల్లో విజయం...

11-10-2026 ఆదివారం మీ రాశి ఫలాలు - ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది

11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?

Sabarimala: శబరిమల యాత్రికుల కోసం QR కోడ్‌లు, సమాచార కేంద్రాల ఏర్పాటు

10-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు... ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది

తర్వాతి కథనం
Show comments