మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2022 (15:50 IST)

పోచమ్మ క్షేత్రంలో అపవిత్రం... మద్యం బాటిళ్లతో పూజలు..

Adelie Pochama field
Adelie Pochama field
తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన అందరినీ షాకింగ్‌కు గురి చేసింది. నిర్మల్ జిల్లా సారంగపూర్ పరిధిలోని అడెల్లి పోచమ్మ క్షేత్రంలో అపవిత్రం జరిగింది. ఆలయంలో మద్యం బాటిళ్లతో పూజలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. 
 
కొందరు అమ్మవారి గర్భగుడిలో మద్యం ఉంచి పూజలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అపవిత్ర పనులకు ఎలా అనుమతిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
అయితే ఇప్పటివరకు ఆలయ అర్చకులు కానీ, అధికారులు కానీ నోరు మెదపకపోవడం పలు సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.