శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (16:05 IST)

తుమ్మి పువ్వుల మాలను శివునికి అర్పిస్తే...

Maha Shivaratri
లోకాన్ని రక్షించేందుకు విషాన్ని సేవించిన కాలం ఈ ప్రదోష కాలం. ప్రదోష కాలంలో శివాలయాన్ని సందర్శించడం శుభప్రదం. ప్రదోషం అమావాస్యకు మూడు రోజుల ముందు, పౌర్ణమికి మూడు రోజుల ముందు రావచ్చు. ప్రదోష సమయం సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు.
 
ప్రదోషం అన్ని దోషాలను తొలగిస్తుంది. ప్రదోష నాడు సమీపంలోని శివాలయాన్ని సందర్శించండి. నందిదేవరునికి, శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించాలి. బిల్వార్చన, ఆవు పాలతో అభిషేకం చేస్తే సకల ప్రయోజనాలు కలుగుతాయి. 
 
అన్నింటికంటే మించి ప్రదోషం రోజున శివుడికి తుంబ పుష్పమాల వేసి పూజిస్తే సర్వ దోషాలు అంటే ఏడు జన్మలదోషాలు, బ్రహ్మహత్యాపాతకం తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి.