బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. శ్రీకృష్ణాష్టమి
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (17:22 IST)

గోకులాష్టమి నాడు కన్నయ్యను నిష్టగా పూజిస్తే...

Krishna
గోకులాష్టమి నాడు కన్నయ్యని నిష్టగా పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున శ్రీకృష్ణుడి దేవాలయాలను కచ్చితంగా దర్శించుకోవాలని చెప్తున్నారు. దీనివల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందట. 
 
అలాగే మోక్షప్రాప్తి పొందుతారట. సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలన్నీ తొలగిపోతాయి. అనుకున్నది జరగాలంటే శ్రీకృష్ణుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, కొందరు రాత్రివేళ్లే కృష్ణపూజ చేస్తారు. 
 
కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిది. కృష్ణునికి పొన్నచెట్టుతోనూ అనుబంధం ఉంది. 
 
వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజిస్తే శుభం. కృష్ణాష్టకమ్‌, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ, పరిమళభరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.