ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (10:48 IST)

పంచమి రోజున వారాహి పూజ.. ఈ 12 నామాలను మరిచిపోవద్దు..

Godess Varahi
పంచమి రోజున వారాహి పూజను మరిచిపోవద్దు అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. సాధారణంగా వారాహీ పూజను సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయానికి తర్వాత చేయాలి. దేవి పూజకు రాత్రి పూట ప్రశస్తమైనది. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆమెను పూజించడం మంచిది. నేడు రక్ష పంచమి నాడు పాములకు, ఇతర అడవి జంతువులకు చిన్న నైవేద్యాలు సమర్పించడం మంచిది. 
 
ఇలా చేస్తే కోరిన కోరికలను ఆమె నెరవేరుస్తుంది. అలాగే వారాహీ దేవి సప్త మాతృకలలో ఒకరు. అలాగే  దశమహా విద్యలలో కూడా ఈమెను కొలుస్తారు. లక్ష్మీ స్వరూపంగా వారాహిని భావిస్తారు. వారాహి దేవి లలితా పరాభట్టారిక సేనాని. లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలన్నీ వారాహీ దేవి ఆధీనంలో వుంటాయి. అందుకే ఆమెను దండనాథ అంటారు. 
 
అమ్మ స్వరూపాన్ని గమనిస్తే.. వారాహి ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల (నాగలి), ముసల (రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. ఈమె ఉగ్రంగా కనిపించినప్పటికీ కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ముఖ్య ప్రాణ రక్షిణి. 
 
ఈమెపై హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైనవి. రోజూ వీటిని 11 సార్లు పఠిస్తే మంచి ఫలితం వుంటుంది. అవేంటంటే.. పంచమి, దండనాథా, సంకేతా, సమయ సంకేత, వారాహీ, పోత్రిణి, వార్తాళి, శివా, మహాసేన, ఆజ్ఞా చక్రేశ్వరి, అరిఘ్ని అనేవి.