Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు రాశిఫలితాలు .. అతిథి మర్యాదలు బాగుగా...

మేషం : సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగస్తులకు, వ్యాపారులకు విశ్రాంతి లభిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. సోదరీ

Written By pnr
Updated: ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (10:19 IST)
మేషం : సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగస్తులకు, వ్యాపారులకు విశ్రాంతి లభిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. 
 
వృషభం : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించండి. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒడిదుడుకులు తప్పవు. 
 
మిథునం : మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. పొగడ్తలు, మొహమ్మాటాలకు దూరంగా ఉండాలి. పుణ్యక్షేత్ర సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీల ఆరోగ్యం మందగించడం వల్ల పనులు వాయిదా వేసుకుంటారు. 
 
కర్కాటకం : విలాస వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. పండ్లు, పూలు, కొబ్బరి, కూరగాయల వ్యాపారస్తులకు లాభదాయకం. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. తలచిన కార్యాల్లో జాప్యం జరుగుతుంది. ఖర్చులు అధికమైన తట్టుకోగలుగుతారు. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. 
 
సింహం : ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టతరమవుతుంది. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిదికాదు. ఆత్మీయులకు విలువైన కానుకలు అందించి ఆదుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కొంటారు. 
 
కన్య : గతంలో నిలిపివేసి వ్యాపారాలు, పనులు పునః ప్రారంభించడానికి చేయు యత్నాలు కలిసివస్తాయి. విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఉత్సాహం, ఏకాగ్రత ఏర్పడతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. 
 
తుల : ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు కలిసివస్తాయి. ప్రముఖులతో పరిచయాలు, కుటుంబ సౌఖ్యం, తరచూ విందు భోజనాలు వంటి శుభ సంకేతాలుంటాయి. ఖర్చులు అధికమవుతాయి. మీ మంచితనం, మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. 
 
వృశ్చికం : రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు జరుగుతాయి. నిరుద్యోగులు గడిచిన కాలం గురించి ఆలోచిస్తూ కాలం వృధా చేయకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పత్రిక, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. బంధువుల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి. 
 
ధనస్సు : కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తాయి. రాజకీయ నాయకులు వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. పాత మిత్రులను కలుసుకుని వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
మకరం : వైద్య శిబిరంలోని వారు తరచూ ఒత్తిడులకు గురవుతారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోతుంది. దీంతో ఆందోళన చెందుతారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
కుంభం : ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సన్నిహితులతో కలిసివిందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన ధనం చేతికందటంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. 
 
మీనం : విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి విషయంలో కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ ఆభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మీ మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. రావలసిన ధనం వాయిదాపడుతుంది. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

అనకాపల్లిలో పట్టుబడిన లంచావతారం, ఒక్కసారి మీ ముఖాన్ని చూపిస్తే ఫోటో తీసుకుంటాం, వీడియో

ముంబైలో ప్రధాని.. వేదిక వద్ద తుపాకీతో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

పెళ్లైన కొన్ని నెలలకే భార్యను హత్య చేసి తలను ఫ్రిడ్జ్‌లో పెట్టిన భర్త.. ఎక్కడ?

ఆసియాలోనే తొలిసారిగా సిమ్స్‌లో న్యూ జనరేషన్ బోన్-స్పారింగ్ హిప్ ఆపరేషన్

తిరునెల్వేలి గ్యాంగ్ రేప్ కేసు.. ముద్దాయికి ఉరిశిక్ష - పోక్సో కోర్టు తీర్పు

అన్నీ చూడండి

Tirumala: తిరుమల రాజగోపురంపై శ్రీకృష్ణుని విగ్రహపు చేయి విరిగిపోయిందా?

టీటీడీ భద్రతా ఉద్యోగులకు మాజీ సైనికులు అర్హులే..

08-09-2026 మంగళవారం ఫలితాలు - అనవసరమైన ఖర్చులు చేయవద్దు..

శ్రీవారి బ్రహ్మోత్సవాలు-2026.. టీటీడీ సిబ్బంది వివరాల తనిఖీ.. క్రిమినల్ కేసులు ఉన్నాయేమో?

07-09-2026 సోమవారం ఫలితాలు - పని, విశ్రాంతి మధ్య సమతుల్యత అవసరం...

తర్వాతి కథనం
Show comments