ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (08:37 IST)

శుక్రవారం మీ రాశిఫలితాలు : అదనపు సంపాదన దిశగా...

మేషం : శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభ పరిణామాలు సంభవం. ఓర్పు, పట్టుదలతో అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. స్వతంత్ర నిర్ణయాలు చేసుకోవటంవల్ల శుభం చేకూరుతుంది. ఖర్చులు అధికం అవుతాయి. తలపెట్టిన

మేషం :  శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభ పరిణామాలు సంభవం. ఓర్పు, పట్టుదలతో అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. స్వతంత్ర నిర్ణయాలు చేసుకోవటంవల్ల శుభం చేకూరుతుంది. ఖర్చులు అధికం అవుతాయి. తలపెట్టిన పనులు వాయిదా పడతాయి. చేతివృత్తుల వారికి అవకాశం లభించినా ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది.
 
వృషభం : ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబ అవసరాలు పెరగటంతో అదనపు సంపాదన దిశగా ఆలోచనలు చేస్తారు. లీజు, కాంట్రాక్టులు, వ్యాపారాల విస్తరణకు సంబంధించిన విషయాలలో పెద్దల సలహా తీసుకోవటం మంచిది. ఆడిటర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు లాభదాయకం.
 
మిథునం : బంధుమిత్రుల నుంచి ఒత్తిడి, మొహమాటాలు వంటివి ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఏ చిన్న అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది. ఆడిటర్లకు ఒత్తిడి, మొహమాటాలు వంటివి ఎదుర్కొంటారు. చిరు వ్యాపారులకు లాభదాయకం. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెలకువ అవసరం.
 
కర్కాటకం : బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్, పత్రికా సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. ధన వ్యయం చెల్లింపులకు సంబంధించిన విషయాలలో ఏకాగ్రత అవసరం. పరిచయాలు, వ్యాపకాలను పెంచుకుంటారు. మీ ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
సింహం : కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెలకువ అవసరం. కనిపించకుండా పోయిన విలువైన పత్రాలు, రశీదులు తిరిగి లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. కుటుంబీకుల మధ్య అవగాహనాలోపం ఏర్పడుతుంది.
 
కన్య : నూతన ఒప్పందాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. చేపట్టిన పనులలో చికాకులు, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. సభలు, సమావేశాలలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. రాబడికి మించిన ఖర్చులు ఎదుర్కొంటారు.
 
తుల : స్థిరాస్థుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడటం మంచిది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను తెచ్చుకోకండి. ధన వ్యయం విపరీతంగా ఉన్నా సార్థకత ఉంటుంది. కళలు, రాజకీయ, ప్రజా సంబంధ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి.
 
వృశ్చికం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి ఆశాజనకం. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. నిర్మాణాత్మకమైన పనులలో చురుకుదనం కనిపిస్తుంది. రాజకీయాలలోని వారికి రహస్యపు విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. మీరు చేపట్టిన పనిలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు. ప్రముఖులు మీ సహాయ సహకారాలను అర్థిస్తారు.
 
ధనస్సు : టెక్నికల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాలలోని వారికి లాభదాయకం. కిరాణా, ఫ్యాన్సీ రంగాలలోని వారికి ప్రోత్సాహం చేకూరుతుంది. ప్రేమికులకు పెద్దల నుంచి చికాకులు తప్పవు. విద్యార్థులకు విద్యా విషయాలపట్ల ఏకాగ్రత అవసరం. ప్రముఖుల సహకారంతో మీ సమస్య మీకు అనుకూలంగానే పరిష్కరింపబడుతుంది. బ్యాంకు రుణాలు తీర్చుతారు.
 
మకరం : బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెలకువ అవసరం. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాలవల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. సోదరీ, సోదరులతో పరస్పర అవగాహనాలోపం తలెత్తవచ్చు. గత స్మృతులు జ్ఞప్తికి రాగలవు. స్త్రీల ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం.
 
కుంభం : ఆదాయ వ్యయాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఐరన్, సిమెంట్, కలప, ఇటుక, ఇసుక వ్యాపారస్తులకు శుభదాయకం. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ అవసరం. ఉన్నతస్థాయి అధికారులకు, క్రిందిస్థాయి సిబ్బందితో ఇబ్బందులు ఎదురవుతాయి.
 
మీనం : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. తలపెట్టిన పనిలో చికాకులను ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. దాన ధర్మాలు చేయటంవల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. మిమ్మల్ని అభిమానించే ఆత్మీయులను బాధపెట్టడం మంచిది కాదని గమనించండి.