మేషం : జాయింట్ వెంచర్లు, ఉమ్మడి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. ఆరోగ్యంలో స్వల్ప చికాకులుంటాయి.
వృషభం : రావలసిన ధనం అందకపోవటంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. ఒక వ్యవహారం నిమిత్తం ప్రముఖులను కలుసుకుంటారు. మీ ఉన్నతిని చాటుకునేందుకు ధనం విరివిగా ఖర్చు చేస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించవు.
మిథునం : మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అనుకూలత. ఉద్యోగస్తులకు అధికారులతో సమన్వయం లోపిస్తుంది. దైవ దర్శనంవల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చెల్లింపులు వాయిదా వేస్తారు. సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆకస్మికంగా దూర ప్రయాణం చేయవలసి ఉంటుంది.
కర్కాటకం : తలపెట్టిన పనులు వాయిదా వేస్తారు. బంధువుల రాకపోకలుంటాయి. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ యత్నాలకు కుటుంబీకులు సహాయ, సహకారాలు అందిస్తారు. విద్యార్థులకు పాఠ్యాంశాలపట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. నూతన పరిశ్రమలు, వ్యాపార విస్తరణలు అనుకూలిస్తాయి. ముఖ్యులపట్ల ఆరాధన పెరుగుతుంది.
సింహం : దంపతుల మధ్య కలహం తలెత్తుతుంది. మీపై సన్నిహితుల మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. సమయానికి కావలసిన వస్తువు కనిపించకపోవచ్చు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం మంచిది. స్పెక్యులేషన్ సామాన్యంగా ఉంటుంది.
కన్య : గృహోపకణాలు అమర్చుకుంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యవసాయ రంగాల వారికి చికాకులు తప్పవు. వీసా, పాస్‌పోర్టులకు సంబంధించిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. ప్రలోభాలకు లొంగవద్దు. చిరు వ్యాపారులకు అనుకూలం.
తుల : ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. చిన్నారులకు బహుమతులు అందిస్తారు. విందులు, వినోదాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటంవల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. క్రయ విక్రయాలు సామాన్యం. నూతన పరిచయాలు ఏర్పడతాయి.
వృశ్చికం : కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకం. వృత్తుల వారికి నిరుత్సాహం తప్పదు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తంగా మెలగండి. ఒక ప్రకటనపట్ల ఆకర్షితులవుతారు. స్త్రీలకు బంధువులతో సఖ్యత నెలకొంటుంది.
ధనస్సు : కోర్టు వ్యవహారాలు వాయిదా పడే సూచనలున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ఏకాగ్రత, పెద్దల సలహా పాటించటం క్షేమదాయకం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి.
మకరం : స్త్రీల కళాత్మకతకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. చెల్లింపులు, షాపింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. మిత్రుల తీరు నిరుత్సాహపరుస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ప్రముఖుల కలయిక ఉపకరిస్తుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు.
కుంభం : హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కష్ట సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. నిర్మాణ పనులు, మరమ్మత్తులలో ఏకాగ్రత వహించండి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అనుకున్న పనులు ఒకపట్టాన పూర్తికావు. బంధువుల నుంచి కొత్త విషయాలను గ్రహిస్తారు. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినాల్సి వస్తుంది.
మీనం : మీ దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరపుతారు. దైవ కార్యాలలో చురుకుగా వ్యవహరిస్తారు. రుణ విముక్తులు కావటంతో మానసికంగా కుదుటపడతారు. భాగస్వామిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి.