Webdunia - Bharat's app for daily news and videos

Install App

04-07-2018 - బుధవారం మీ రాశి ఫలితాలు.. ఒంటరిగానే లక్ష్యాలను?

మేషం: పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రహస్య విరోధులు అధికం కావడం వలన రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆకస్మిక ఖర్

Written By Raman
Updated: బుధవారం, 4 జులై 2018 (09:22 IST)
మేషం: పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రహస్య విరోధులు అధికం కావడం వలన రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆకస్మిక ఖర్చులు సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వలన ఒకింత ఇబ్బందులు తప్పవు.
 
వృషభం: సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రైవేటు సంస్థలవారు మార్పులకై చేయు ప్రయత్నాలలో జయం చేకూరుతుంది. కొందరి ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారి తీస్తాయి. వృత్తి వ్యాపారులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ మాటలకు సంఘంలో గౌరవం లభిస్తుంది. 
 
మిధునం: వస్త్రాలు, ఆభరణాలు విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుగలవు. రుణయత్నాలలో కూడా స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. భార్య భర్తలు, ప్రేమికులు సంతోషంగా, ఉల్లాసంగా గడపడానికి తగిన సమయం. వివాదాలు చుట్టుముడతాయి.  
 
కర్కాటకం: ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. చిన్నారుల విద్యా విషయాల్లో శుభపరిణామాలు సంభవం. స్త్రీలకు ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. గృహోపకరణాలు అమర్చుకుంటారు. కార్యసాధనలో ఎవరి సహాయం మీకు లభించదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.  
 
సింహం: వ్యాపారాలకు కావలసిన రుణం మంజూరవుతుంది. ఉన్నత పదవుల్లో ఉన్నవారు విజయాన్ని పొందుతారు. గతంలో చేసిన పనులకు ఇప్పుడు ఫలితాలు కలుగుతాయి. అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వకండి. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. దంపతుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి.
 
కన్య: లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల విషయాల్లో ఏకాగ్రత పునరాలోచన ముఖ్యం. హోటల్, రవాణా, స్వయం ఉపాధి, వైద్య రంగాలవారికి శుభప్రదం. ప్రియతములతో ప్రయాణాలకు ఏర్పాటు చేసుకుంటారు. ఇంటికోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాగలవు.
 
తుల: పెట్టుబడుల పొదుపు పథకాల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు వాయిదా పడుట మంచిది. కుటుంబ విషయాలు ఆవేదన కలిగిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.  
 
వృశ్చికం: ఆర్థిక సంస్థలతో లావాదేవీలు అనుకూలిస్తాయి. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వలన ఆరోగ్యం మందగిస్తుంది. బ్యాంకులు ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. విదేశీయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో చికాకులు తప్పవు. 
 
ధనస్సు: సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. 
 
మకరం: ప్రింటింగ్ రంగాలవారికి బకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. సన్నిహితులతో ఉన్న మనస్పర్ధలను తొలగించుకోవడానికి ఇది తగిన సమయం. దూరప్రయాణాలలో మెళకువ అవసరం. స్త్రీలకు పనివారలతో చికాకులు ఎదుర్కుంటారు. కొత్త వ్యక్తులతో అనుకోని బంధం బలపడుతుంది. 
 
కుంభం: ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఫలించక పోవచ్చును అందువల్ల మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి. విందులు, వినోదాలు, దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి.
 
మీనం: దూరపు బంధువుల ప్రోత్సాహంతో పనులలో పురోభివృద్ధిని సాధిస్తారు. మీ వాహనం ఇతరులుక ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీలు అపరిచిత వ్యక్తులపట్ల జాగ్రత్త వహించండి. రాజకీయ నాయకులు విదేశీపర్యటనలు చేస్తారు. ఆప్తులు, స్నేహితుల సహకారాన్ని కోరటానికి వెనుకాడవద్దు. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments