16-03-2019 - శనివారం మీ రాశి ఫలితాలు.. కొన్ని సమస్యలు..?

శనివారం, 16 మార్చి 2019 (09:47 IST)
మేషం: ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరమని గమనించండి. అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించడం ఉత్తమం. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. 
 
వృషభం: ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై దృష్టి సారిస్తారు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. రాజకీయనాయకులు సభాసమావేశాలలో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు.
 
మిధునం: విద్యార్థినుల ఆలోచనులు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. మీ మనోభావాలకు మంచి స్ఫురణ లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. స్థిరాస్తి అమ్మకం వాయిదా పడడం మంచిది. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కర్కాటకం: ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కున్న నెమ్మదిగి సమసిపోతాయి. మీ ఏమరుపాటుతనం వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. రవాణా రంగాల వారికి ఏకాగ్రత అవసరం.
 
సింహం: కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం మంచిది. తరచు అధికారులు, నేతలతో సంప్రదింపులు జరుపుతారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 
 
కన్య: ఉద్యోగ బాధ్యతలు పెరగటంతో పాటు పనిభారం అధికమవుతుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. బంధువుల రాక అందరికీ సంతోషం కలిగిస్తుంది. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. మీ శ్రీమతి సలహా పాటించడం వలన మేలు జరిగే అవకాశం ఉంది.  
 
తుల: కొన్ని సమస్యలు అప్రయత్నంగానే పరిష్కారమవుతాయి. బంధువుల రాకతో ఖర్చులు అధికమైనా భారమనిపించవు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి, సమస్యలు తప్పవు. వాహనచోదకులకు ఏకాగ్రత ముఖ్యం. ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.  
 
వృశ్చికం: ఉద్యోగస్తులు పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయగల్గుతారు. భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా సాగుతాయి. సోదరులతో ఏకీభవించలేకపోతారు. కొత్త వ్యక్తులను అతిగా నమ్మటం మంచిదికాదు. అలంకరణలు, విలాస వస్తువుల పట్ల స్త్రీలు ఆకర్షితులవుతారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.  
 
ధనస్సు: ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలం. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ఏ క్షణమైనా విపత్కర పరిస్థితులు ఎదురయ్యే సూచనలున్నాయి. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. స్పెక్యులేషన్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. 
 
మకరం: కంప్యూటర్, ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి చికాకులు, పనిభారం అధికం. ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికం. బ్యాంకు నుండి పెద్దమొత్తంతో ధనం డ్రా చేసేవిషయంలో జాగ్రత్త. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. 
 
కుంభం: కార్యసాధనలో జయం పొంది ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. మీ సంతానం పై చదువుల కోసం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు నిరుత్సాహం తప్పదు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికం.  
 
మీనం: బంధువుల నుండి అందిన ఆహ్వానం మిమ్ములను సందిగ్ధానికి గురిచేస్తుంది. గృహ నిర్మాణాలు, ఉపాథి పథకాలకు అనుకూలం. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. స్త్రీలకు అయిన వారి నుండి వస్త్ర, వస్తు, ధనలాభం వంటి శుభ ఫలితాలున్నాయి. మిత్రులను కలుసుకుంటారు. 

అన్నీ చూడండి

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. జూన్ 2 నుంచి 4 మధ్య కేరళలోకి...

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? ఏఐసీసీ ఏమంటోంది?

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.8.70 కోట్లు మాయం.. లక్కీ భాస్కర్ తరహాలో...? (video)

అన్నీ చూడండి

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

తర్వాతి కథనం
Show comments