గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (12:47 IST)

తులసీ వివాహం... పచ్చిపాలు సమర్పిస్తే..

Tulasi
కార్తీక దామోదర మాసంగా పేరుగాంచిన కార్తీకమాసంలో శుద్ద ఏకాదశి (నవంబర్ 23) మరింత విశిష్టత కలిగి ఉంది. ఈ రోజు తులసి మాతను పూజించాలి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి.
 
ఈరోజున ఎర్రటి దారంను తులసి మొక్కకు  కట్టడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది.
 
శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసి చెట్టు యొక్క 11 కొమ్మలను సమర్పించడం వలన జీవితం సుఖమయం అవుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి మొక్కకు పచ్చి పాలను సమర్పించాలని.. ఇది మీ కోరికలను నెరవేరుస్తుందని, ఈ రోజున తులసీ వివాహం చేయడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయని విశ్వాసం.