బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (12:31 IST)

కార్తీక మాసం ఏకాదశి.. విష్ణుమూర్తికి పూజలు చేస్తే..?

Lord Vishnu
కార్తీక మాసంలోని ఏకాదశి చాలా ఉత్తమమైనది. ఏకాదశి రోజున చెరుకు మంటపాన్ని అలంకరించి ఆ మంటపం లోపల విష్ణుమూర్తిని విధిగా పూజించాలని పురాణాలు చెప్తున్నాయి. ఇలా చేయడం వల్ల శుభకార్యాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. 
 
దేవప్రబోధని ఏకాదశి రోజున దేవతలు కూడా విష్ణువును నిద్రలేవగానే పూజిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దేవప్రబోధని ఏకాదశి వ్రతాన్ని ఆచరించే అనేక తరాల వారు విష్ణులోకంలో స్థానం పొందేందుకు అర్హులు అవుతారు.
 
ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణుమూర్తికి తులసి ఆకులను సమర్పించండి. ఉపవాసం ఉన్నవారు తులసి ఆకులను స్వయంగా తీయకూడదని గుర్తుంచుకోవాలి. 
 
ద్వాదశి రోజున ఉదయం విష్ణువును పూజించిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దీని తరువాత, తులసి ఆకును తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.