సోమవారం, 18 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

బుధవారం దానిమ్మ పత్రాలు, పువ్వులతో వినాయకుడిని అర్చిస్తే..?

God Ganesh
బుధవారం వినాయక పూజతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే బుధవారం పత్ర పూజతో అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. సాధారణంగా విఘ్నేశ్వరుడిని 21 పత్రాలతో పూజిస్తారు. 
 
వినాయక చతుర్థి, సంకష్టహర చతుర్థి, బుధవారం పూట ఈ 21 పత్రాలతో వినాయకుడిని పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. అలాంటి పత్రాల్లో ముఖ్యంగా విష్ణువర్ధిని ఆకుతో వినాయకుడిని స్తుతింటడం ద్వారా పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది. కార్యసిద్ధి చేకూరుతుంది. దేవదారు ఆకుతో వినాయకుడిని అర్చిస్తే.. మనోధైర్యం చేకూరుతుంది. 
 
గరికతో అర్చన చేస్తే.. గర్భస్థ శిశువుకు రక్షణ లభిస్తుంది. పుట్టే శిశువులకు పరిపూర్ణ జ్ఞానం, ధైర్యం లభిస్తాయి. అలాగే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. బిల్వ ఆకులతో వినాయక అర్చన చేస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. 
 
అలాగే దానిమ్మ పత్రాలలో విఘ్నేశ్వర పూజ చేస్తే పేరు ప్రతిష్టలు చేకూరుతాయి. అంతేకాదు.. దానిమ్మ పువ్వులంటే వినాయకుడికి మహా ప్రీతి. ఎరుపు రంగు పువ్వులను ఆయనకు సమర్పిస్తే చేపట్టిన కార్యం దిగ్విజయం అవుతుంది. అలాగే మందార పువ్వులను సంకష్ట హర చతుర్థి రోజు గణపతికి సమర్పిస్తే ఈతిబాధలు వుండవు. 
Pomegranate Leaves


ఎరుపు రంగు మందార పువ్వులను సమర్పించడం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయి. ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అనుకూలతకు లోటుండదు. కానీ వినాయక పూజకు తులసిని మాత్రం ఉపయోగించకూడదు. శంఖు పువ్వుల్లో తెలుపు, నీలపు రంగు పుష్పాలను విఘ్నేశ్వరుడికి సమర్పించవచ్చు.