బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 29 అక్టోబరు 2020 (15:15 IST)

కాణిపాకం వినాయకునికి లక్ష డాలర్లు వేసిన భక్తుడు, ఎవరు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యత కలిగిన కాణిపాక వరిసిద్థి వినాయకస్వామి ఆలయ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ప్రవాస భారతీయుడు దేవస్థానం ఖాతాకు లక్ష అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చాడు.
 
ఈ డాలర్ల విలువ ఇండియన్ కరెన్సీతో పోలిస్తే 72 లక్షల 88 వేల 877 రూపాయలుగా దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఈ విరాళాన్ని భక్తుడి కోరిక మేరకు అన్నదాన ట్రస్ట్‌కు 50 వేల డాలర్లను, గో సంరక్షణ ట్రస్టుకు 50 వేల డాటర్లన ఆలయ ఖాతాలో జమ చేశారు.
 
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ కాణిపాక వరిసిద్థి వినాయకస్వామివారి ఆశీస్సులతో ఒక ప్రవాస భారతీయుడైన భక్తుడు తన వ్యాపార రంగంలో ప్రగతి సాధించడంతో ఈ విరాళ రూపంలో వినాయకస్వామివారికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే దాతలెవరైనా ఆలయ అభివృద్థికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు.