మంగళవారం, 21 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (22:58 IST)

శుక్రవార వ్రత మహిమ.. రావిచెట్టుకు ప్రదక్షణలు.. వినాయకుడికి 11 దీపాలు

Lord vigneshwara
శుక్రవారం వ్రతం ఆచరించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. శుక్రవార వ్రతం ఆచరించడం ద్వారా శ్రీ లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. కుమార స్వామి, శుక్రుని అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం పూట కొన్ని కార్యాలను ప్రారంభించడం ద్వారా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. 
 
కుబేర దీపాన్ని శుక్రవారం పూట తామర కాడ వత్తులతో దీపాన్ని వెలిగిస్తే.. కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం.. శుక్రహోరలో తామర పత్రాలతో లక్ష్మీదేవికి అర్చన చేయడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే ఇంటిని శుక్రవారం పూట శుభ్రంగా వుంచితే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం వుంటుంది. 
 
అలాగే శుక్రవారం పూట ఉప్పును ఇంటికి తెచ్చుకోవడం మరిచిపోకూడదు. శుక్రవారం రావిచెట్టును 11 సార్లు ప్రదక్షణలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. అలాగే వినాయకుడికి 11 దీపాలు వెలిగించడం ద్వారా ధనాదాయం పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.