Daily Horoscope
✕

కుడిచేతికి ఆ భాగంలో మచ్చ ఉన్నచో..?

Updated: శనివారం, 24 నవంబరు 2018 (14:26 IST)
పుట్టుమచ్చ లేని వారుండరు. చాలామందికి ఎక్కడ చూసినా విపరీతంగా పుట్టుమచ్చలు ఏర్పడుతుంటాయి. కొందరికి మచ్చలంటే చాలా ఇష్టం. మరికొందరి ఈ మచ్చలు ఎక్కువగా వస్తున్నాయని వారిని తొలగిస్తారు. అలా తొలగిస్తే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. కనుక జాగ్రత్త వహించండి. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం అరచేతిలో మచ్చ ఉంటే.. కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
అరచేతియందు పుట్టుమచ్చ ఉన్నచో వారికి విశేషమైన సంపదలు కలుగుతాయి. కుడి అరచేతిమీద బొటనవ్రేలి క్రింద పుట్టుమచ్చ ఉన్నచో వారు విశ్వాసపాత్రుడవుతారు. ధనానికి లోటుండదు. అంతేకాకుండా ఇతరుల అధికారానికి లోబడియుంటారు. కుడి అరిచేతి చిటికెన వ్రేలి యందు మచ్చ ఉన్నచో.. వారు ధనవంతుడవుతాడు. లౌకిక వ్యవహారాలలో నేర్పరియైయుంటారు. 
 
కుడి అరచేతి చూపుడు వ్రేలులో మచ్చ ఉంటే.. వారు మంచి వ్యవహార జ్ఞానం, మాట నేర్పరితనము, ఒంటరిగా నుండుటయు, మాటలచే ధనార్జనశక్తియు, పైకి ప్రేమతో మాట్లాడు స్వభావం కలిగియుంటారు. చేతిమండమీద మచ్చగలవారు కుటుంబ వృద్ధి కలవాడును, సౌఖ్యముగ జీవించువాడునునై యుండును.  

అన్నీ చూడండి

సాలూరులో మహిళా వార్డు వాలంటీర్ మోసం: పొదుపు పేరుతో రూ. 2 కోట్లు వసూలు చేసి డబ్బుతో పరార్

HYDRAA చేపట్టిన సరస్సుల పునరుద్ధరణ.. మొదటి దశ పనులు దాదాపు పూర్తి

నాకు పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా అమ్మాయిని ఇస్తారా?.. ఓ వ్యక్తి ప్రశ్న.. ఎందుకు?

అర్మేనియాలో చితక్కొట్టుకున్న ఎంపీలు... లైవ్ స్ట్రీమింగ్ చేసిన స్పీకర్

నాన్ డైరీ పనీర్‌పై నిషేధం విధించిన ఏపీ సర్కారు

అన్నీ చూడండి

What Is a Pralaya: ప్రళయం అంటే ఏమిటి? ప్రపంచం నాశనమవుతుందా? ఎలా లెక్కిస్తారు?

29-10-2026 గురువారం నాటి రాశి ఫలాలు - శుభకార్యం జరిగే అవకాశం ఉంది

28-10-2026 బుధవారం నాటి రాశి ఫలాలు - కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు

ప్రయాణం చేసే ముందు ఈ మంత్రాలను జపిస్తే...? శుక బ్రహ్మ మహర్షిని?

27-10-2026 రాశి ఫలాలు - శుభవార్తతో ఇంట్లో ఉత్సాహం పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments