సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (14:48 IST)

కార్తీక పౌర్ణమిని ఎప్పుడు జరుపుకోవాలి.. నవంబర్ 22న లేదా 23వ తేదీనా?

కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులను నేతిలో తడిపి దీపమెలిగిస్తారు. ఇలా ఉసిరి చెట్టు కింద లేదా తులసి చెట్టు కింద 365 వత్తులతో నేతిని లేదా నువ్వుల నూనెతో దీపమెలిగించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి. సంవత్సరంలో అన్నీ రోజులు దీపమెలిగించడం కుదరకపోవచ్చు. అందుకే కార్తీక పౌర్ణమిన 365 రోజులు దీపాలు వెలిగించిన గుర్తుగా ఇలా చేస్తారు. 
 
ఇంకా కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దీపమెలిగించిన వారికి సమస్త దేవతలను కొలిచిన పుణ్యం లభిస్తుందని విశ్వాసం. అందుకే ఆ రోజున శివునిని తలచి ఉపవాసం వుంటారు. ఆ రోజు సాయంత్రం ఆలయాల్లో దీపాన్ని వెలిగించి పూజలు చేస్తారు. కానీ ఏడాది పౌర్ణమి తిథి రెండు రోజుల్లో వస్తోంది. 
 
అది కార్తీక పౌర్ణమి 22, 23 తేదీల్లో రావడంతో ఏ రోజున కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలనే సందేహం అందరిలో తలెత్తింది. నవంబర్ 23 మధ్యాహ్నం 12.53 నిమిషాలకు మొదలై నవంబర్ 23 ఉదయం 11.09 నిమిషాలకు ముగుస్తుంది. మరి పౌర్ణమి తిథి వుండే రాత్రి 22వ తేదీన రావడంతో ఆ రోజున కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
నవంబర్ 22వ తేదీ రాత్రి మాత్రమే పౌర్ణమి ఘడియలు వున్నాయి. 23వ తేదీ పౌర్ణమి ఘడియలు లేకపోవడంతో.. 22వ తేదీన పౌర్ణమి పండుగ జరుపుకోవాలని వారు సూచిస్తున్నారు.