గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By chj
Last Modified: శనివారం, 12 మే 2018 (21:19 IST)

ఉదయాన్నే నిద్ర లేచి ఎవర్ని చూస్తే శుభ ఫలితాలుంటాయి?

ఉదయాన్నే నిద్ర లేచేటపుడు ఎవరి ముఖం చూశామో.. ఇలా జరిగింది అని ఏదైనా జరగరానిది జరిగినప్పుడు అనుకుంటుంటారు. కానీ అలాంటి సమస్య లేకుండా ఉదయాన్నే నిద్ర లేవగానే సూర్య భగవానుడిని దర్శించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిషవేత్తలు చెపుతారు. అంతేకాదు నిద్ర లే

ఉదయాన్నే నిద్ర లేచేటపుడు ఎవరి ముఖం చూశామో.. ఇలా జరిగింది అని ఏదైనా జరగరానిది జరిగినప్పుడు అనుకుంటుంటారు. కానీ అలాంటి సమస్య లేకుండా ఉదయాన్నే నిద్ర లేవగానే సూర్య భగవానుడిని దర్శించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిషవేత్తలు చెపుతారు. అంతేకాదు నిద్ర లేవగానే బంగారం, తామరపువ్వు, దీపం వెలుగు, అద్దం, సువాసనను వెదజల్లే చందనం, ఆవు, వృక్షాలు, కుడిచేయి, మృదంగం, సముద్రం, పంట పొలాలు, గోపురాలను చూస్తే ఆ రోజంతా శుభప్రదంగా ఉంటుందని విశ్వాసం.
 
కొందరు అపార్టుమెంట్లలో నివశిస్తుంటారు... అలాంటి వారికి సూర్యుడిని చూసే అవకాశం వుండకపోవచ్చు. కనుక బంగారం, తామరపువ్వు, దీపం వెలుగు వంటి సీనరీలను పడకగదిలో అంటించుకుని వాటిని చూడటం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. ఇకపోతే ఎక్కడికైనా ప్రయాణమవుతున్న సమయంలో మహిళలు ఎదురుగా వస్తే చేపట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. పండ్లు, పువ్వులు, పసుపు కుంకుమలు ఎదురుగా వస్తే శుభం చేకూరుతుంది.