ఉదయం 4.30 నిమిషాల నుంచి 6 గంటల మధ్య దీపం వెలిగిస్తే....
దీపం వెలిగించడమంటే దేవుడిని ఆరాధించడమే. దీపారాధనను శాస్త్రోక్తంగా చేయాలి. అది దీపం ఏర్పాటు చేసుకోవడం నుంచే ప్రారంభమవుతుంది. ఉదయం 4.30 నిమిషాల నుంచి 6 గంటల మధ్య వెలిగిస్తే ఆ ఇంటిలో అధిక సంపద, దేవుళ్ళ ఆశీర్వాదం, కుటుంబంలో శ్రేయస్సు వృద్ధి చెందుతాయి. 48
దీపం వెలిగించడమంటే దేవుడిని ఆరాధించడమే. దీపారాధనను శాస్త్రోక్తంగా చేయాలి. అది దీపం ఏర్పాటు చేసుకోవడం నుంచే ప్రారంభమవుతుంది. ఉదయం 4.30 నిమిషాల నుంచి 6 గంటల మధ్య వెలిగిస్తే ఆ ఇంటిలో అధిక సంపద, దేవుళ్ళ ఆశీర్వాదం, కుటుంబంలో శ్రేయస్సు వృద్ధి చెందుతాయి. 48 రోజుల పాటు ప్రతిరోజు ఇలా వెలిగిస్తే మనోసిద్ధి కలుగుతుంది. అంటే మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయి.
సాయంత్రం 6 నుంచి 6.30 మధ్యలో దేవునికి దీపాలను వెలిగిస్తే ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు.. ఉత్తమ జీవితం కావాలనుకునే వారు కుటుంబ సంతానాన్ని పొందుతారు. ఆ ఇంటిలోని వారందరికీ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. దీపంతో ప్రాథమికంగా రెండు ఒత్తులు వేయాలి. ఒత్తులు విడివిడిగా ఉండాలి. ఆ రెండు ఒత్తుల చివరలో మాత్రం కలిపి ఉండాలి. అలా కలిపి ఉండేలా తైలంతో కలిపి చుట్టాలి. ఆ తరువాత వెలిగించాలి.
ఆత్మ పరమాత్మలో లీనం కావడానికి ఇది ప్రతీక. సాయంసంధ్యా దీపాన్ని ఇంట్లో వెలిగించే ముందు పూజా ప్రదేశంలో దేవుని ముందు ఒకటి, గుమ్మానికి గల దాలబందిరానికి చెరో మూలా వెలిగించాలి. ఏ ఆరాధనకు దీపం వెలిగించామో అది పూర్తయ్యే వరకు దీపం వెలుగుతూనే ఉండాలి. దీపారాధనను గణపతి ప్రార్థనతో ప్రారంభించి ఆరాధించాలి. ప్రధాన దీపంతో మరొక దీపాన్ని వెలిగించకూడదు. నువ్వుల నూనెతో వెలిగించిన దీపం దేవుడికి ఎడమ వైపున, ఆవు నెయ్యితో వెలిగించిన దీపం దేవునికి కుడివైపున ఉండాలి. దీపారాధనకు ప్రమదిలో వెలిగించే ఒత్తి ఆగ్నేయ దిశగా ఉంటే ఎంతో శుభకరం.