శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : శుక్రవారం, 25 మే 2018 (13:14 IST)

శుక్రవారం మే 25, 2018- పద్మినీ ఏకాదశి.. తెల్లని వస్త్రాలతో విష్ణు ఆలయానికెళ్లి?

శుక్రవారం మే 25, 2018న పద్మిని ఏకాదశి లేదా కమలా ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసము వుండే వ్యక్తి శుభాలు పొందుతాడు. కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటాడు. ఏకాదశి రోజున అదీ పద్మిని ఏకాదశి రోజున ఉపవాసం

శుక్రవారం మే 25, 2018న పద్మిని ఏకాదశి లేదా కమలా ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసము వుండే వ్యక్తి శుభాలు పొందుతాడు. కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటాడు. ఏకాదశి రోజున అదీ పద్మిని ఏకాదశి రోజున ఉపవాసం వుండే వారికి మోక్షం లభిస్తుంది. పూర్వం పద్మినీ అనే రాణికి సంతానం లేకపోవడంతో ఈ రోజున ఉపవసించడం ద్వారా పుత్ర సంతానం పొందగలిగిందని పురాణాలు చెప్తున్నాయి.  
 
అందుచేత పద్మిని శుక్ల పక్షాన ఏకాదశిని మేల్కొలుపుతో ఉపవాసం చేస్తే, మీ కోరికలు నెరవేరుతాయి. ఏకాదశి రోజున బార్లీ, బియ్యంతో చేసిన జావను తీసుకోవచ్చు. దశమి రోజున ఉపవాసాన్ని ప్రారంభించి.. ఉప్పుతో కూడిన ఆహారం తీసుకోకూడదు. 
 
ఏకాదశి రోజున ధాన్యాలు, పప్పులు, తేనె, కూరగాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటివి వాడొచ్చు. మాంసాహారాన్ని తీసుకోకూడదు. తీపి బంగాళాదుంపలను తీసుకోవచ్చు. బ్రహ్మచార్యాన్ని పాటిస్తూ.. భూమిపైనే శయనించాలి. తెల్లని వస్త్రాలు ధరించి, విష్ణు ఆలయానికి వెళ్లి విష్ణువును పూజించాలి.