సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (12:16 IST)

మహా శివరాత్రి-శని ప్రదోషం- కుంభరాశిలో త్రిగ్రాహి యోగం.. అస్సలు వదులుకోవద్దు..

Lord shiva
Lord shiva
శివరాత్రి పండుగను ఈ ఏడాది ఫిబ్రవరి 18న జరుపుకుంటారు. ఈ శివరాత్రి రోజున ప్రదోష కాలంలో శివ పూజ చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మహాశివరాత్రి పండుగ శనివారం వస్తోంది. 
 
అంతేగాకుండా మహాశివరాత్రి పండుగ రోజున శనిప్రదోషం జరుపుకుంటారు. అలాగే శివరాత్రి రోజున సర్వార్థ సిద్ధి యోగం చేకూరుతుంది. అలాగే వాశి యోగం, శంఖ యోగం కూడా ఈ రోజున ఉంటాయి.  
 
గ్రహ కలయిక: ఈ రోజున శనిదేవుడు తన మూల త్రిభుజం కుంభరాశిలో ఆధిపత్యం వహిస్తాడు. అలాగే సూర్య గ్రహం కూడా కుంభరాశిలో ఆధిపత్యం వహిస్తుంది. చంద్రుడు కూడా కుంభరాశిలో ఉంటాడు. అంటే త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది.
 
ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి 18 ఫిబ్రవరి 2023 రాత్రి 08.05 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు 19 ఫిబ్రవరి 2023 సాయంత్రం 04.21 గంటలకు ముగుస్తుంది. అంటే త్రయోదశి తిథి 18వ తేదీ రాత్రి 08:05 గంటల వరకు ఉంటుంది. 
 
ఆ తర్వాత చతుర్దశి ప్రారంభమవుతుంది. మహాశివరాత్రి రోజున నాలుగు జామల్లో జరిగే పూజలో పాల్గొంటే సర్వం సిద్ధిస్తుంది. చతుర్దశి తిథి ఫిబ్రవరి 19 సాయంత్రం ముగుస్తుంది కాబట్టి.. ఫిబ్రవరి 18 రాత్రి మాత్రమే మహాశివరాత్రి జరుపుకుంటారు.