పౌర్ణమి రోజున రాశిని బట్టి స్నానం.. కన్యారాశి వారు ఏలకులను నీటితో కలిపి..?
గ్రహదోషాల నుంచి విముక్తి పొందేందుకు ప్రతి పౌర్ణమి రోజున రాశిని బట్టి స్నానం చేయవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
మేషం- సూర్యోదయానికి ముందు నీటిలో మందార పువ్వులతో స్నానం చేయాలి. వృషభం - నీళ్లలో నువ్వులతో స్నానం చేయాలి. మిథునరాశి - నీళ్లలో కొంచెం చెరుకు రసం కలిపి స్నానం చేయడం మంచిది.
కర్కాటక రాశి - పంచకావ్యాన్ని నీటిలో కలిపి స్నానం చేయాలి. సింహం - గంగాజలం, కుంకుమలతో కలిపి స్నానం చేయాలి.
కన్యారాశి-ఏలకుల నీటితో కలిపి స్నానం చేయాలి. తులారాశి - నీటిలో గులాబీ రేకులతో స్నానం చేయాలి. వృశ్చిక రాశి- సూర్యోదయానికి ముందు నీళ్లలో ఎర్రచందనం కలిపి తలస్నానం చేయాలి.
ధనుస్సు - నీటిలో పసుపు- ఆవాలు కలిపి స్నానం చేయాలి. మకరం - నల్ల నువ్వులతో స్నానం చేయాలి. కుంభం - నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో స్నానం చేయాలి. మీనం - పసుపు కలిపిన నీటిలో స్నానం చేయాలి.