1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Nirjala Ekadashi 2023 Importance

నేడు నిర్జల ఏకాదశి.. భీముడు ఆచరించిన ఉపవాస వ్రతం.. నీటిని దానం చేస్తే..?

Nirjala Ekadashi 2023
నేడు నిర్జల ఏకాదశి. భీముడు స్వయంగా ఆచరించిన ఉపవాసం కనుక భీమ ఏకాదశిగానూ జరుపుకుంటారు. ఈ రోజు నీటిని దానం చేసిన వారికి కోటి పుణ్యాలు లభిస్తాయి. ఈ ఏకాదశి రోజున ఉపవాసం వుంటే వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుంది. 
 
ఈ మహిమాన్వితమైన రోజున పేదవారికి నీటిదానం చేయాలి. ఈ ఏకాదశి వ్రతం ద్వారా పుణ్య నదులలో స్నానమాచరించిన ఫలాలు, వివిధ దానాల ఫలాలు లభిస్తాయి. అంతేగాకుండా పుణ్య ఫలం చేకూరుతుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు తమ పాపాల నుండి విముక్తులవుతారు. 
 
ఇంకా వారి పూర్వీకులు కూడా వంద తరాల పాపాల నుండి విముక్తులవుతారు. అలాగే ఈ రోజున నారాయణ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలలో భాగం కావడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
తర్వాతి కథనం
01-06-2023 నుంచి 30-06-2023 వరకు ఫలితాలు మీ మాస ఫలితాలు