1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (12:01 IST)

ఆహారంలో ఫైబర్ ఎందుకు?

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఫైబర్ మన శరీరానికి ఎందుకు అవసరమో తెలుసుకుందాము.
 
ఫైబర్ ప్రీబయోటిక్. దీంతో పెద్దపేగులో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.
 
ఫైబర్ ఒక ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, బీన్స్ మొదలైన వాటి నుండి ఫైబర్ లభిస్తుంది.
 
ఆహారంలో తీసుకునే పీచు కూడా చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది.
 
పీచుతో కూడిన ఆహారం తిన్న సంతృప్తిని ఇస్తుంది. దీంతో పొట్ట నిండుగా ఉంటుంది.
 
పిండి మొదలైన ఫైబర్ రహిత పదార్థాలు ఆరోగ్యానికి హానికరం.
 
ఫైబర్ కడుపుని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.
 
ఆహారంలో తగినంత ఫైబర్ మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు, ఊబకాయాన్ని దూరంగా ఉంచుతుంది.
 
గమనిక: వైద్యుని సలహా మేరకు మాత్రమే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ప్రయత్నించండి.