ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (23:01 IST)

జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ ఆఫర్‌.. వారికి గుడ్ న్యూసే

reliance jio
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం 5జీ సేవలపై దృష్టి పెట్టింది. అంతేగాకుండా ఇంటర్నెట్‌లో సూపర్ ఆఫర్లను ఇచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌తో ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 
 
అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 28 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కొత్త ఫైబర్ ప్లాన్స్ లేదా కొత్త కనెక్షన్స్ బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్స్ లభిస్తాయి. కేవలం రూ.599, రూ.899 ప్లాన్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేగాకుండా ఈ ప్లాన్ ద్వారా రిలయన్స్ జియో ఏకంగా రూ.6,500 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది.