1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 జనవరి 2023 (23:07 IST)

వైకుంఠ ఏకాదశి.. కూర్మ ద్వాదశి విశిష్టత... బంగారు వర్ణంలో తాబేలును?

Kurma Dwadashi
వైకుంఠ ఏకాదశి వ్రతమాచరించిన వారు ద్వాదశి రోజున పారణ చేయడం ఐతిహ్యం. ఈ ఏడాది ద్వాదశి తిథి.. జనవరి 3, 2023, రాత్రి 10.19 నిమిషాలకు ముగియనుంది. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి పుణ్య స్నానాలు చేయాలి. పుణ్యస్నానం చేసిన అనంతరం విష్ణుమూర్తిని ప్రార్థించాలి. 
 
ఈ రోజున విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. ఆ రోజున స్వచ్ఛమైన ఆవు నేతితో దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
స్వామికి నైవేద్యంగా పండ్లు, పంచామృతం అభిషేకం సమర్పించాలి. అలాగే విష్ణు సహస్ర నామాన్ని, నారాయణ స్తోత్రాన్ని పఠించాలి. ఇంకా కూర్మావతారమైన తాబేలును పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. బంగారం వర్ణంలో ఉండే తాబేలు ఇంట్లో వుంచడం శుభప్రదం.
 
కూర్మ ద్వాదశి రోజున దేవతలు, రాక్షసులు అమృతం కోసం సాగర మథనం చేశారని పురాణాలు చెప్తున్నాయి. వీరంతా మందర పర్వతాన్ని ఉపయోగించి సాగర మథనం చేశారు. 
 
ఆ సమయంలో విష్ణువు కూర్మావతరంలో మందర పర్వతాన్ని ధరించి, సాగర మథనం చేస్తున్న వారితో దేవతలకు అమృతం ఇచ్చినట్లు విశ్వాసం. అందుకే కూర్మ ద్వాదశి రోజున శ్రీ మహా విష్ణువుకు అంకితం చేస్తారు.