శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జులై 2023 (16:03 IST)

శ్రావణ మాసంలో శివునికి ఈ పుష్పాలను సమర్పిస్తే..?

Maha Shivaratri
మహాదేవునికి నచ్చిన పువ్వులను శ్రావణ మాసంలో సమర్పిస్తే సర్వశుభాలు చేకూరుతాయి. జులై 18 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ మాసం పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. 
 
శ్రావణ మాసంలో ఈశ్వరుడికి జలాభిషేకం, రుద్రాభిషేకం చేయడం విశిష్టమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. శివునికి ఇష్టమైన వస్తువును సమర్పిస్తే ప్రతి కోరికను తీరుస్తాడని అంటారు. ఆశించిన ఫలితాన్ని పొందడానికి, శివునికి ఇష్టమైన పువ్వులను పూజలో సమర్పించడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. 
 
తెల్లగన్నేరు 
శివునికి ఇష్టమైన రంగు తెలుపు, కాబట్టి ఆయన పూజలో తప్పనిసరిగా తెల్లని పూలను సమర్పించాలి. తెల్ల, నీలపు గన్నేరును సమర్పించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
మల్లెపువ్వులు 
శ్రావణ మాసంలో శివునికి బెల్లం నైవేద్యంగా పెట్టడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి. అభిషేక సమయంలో శివునికి మల్లెపూలు సమర్పించి చాలా సంతోషిస్తాడు. ఆయన అనుగ్రహం వల్ల వాహన సుఖం కూడా లభిస్తుంది.  
 
తామరపువ్వు 
సంపద పొందాలనుకునేవారికి శివునికి తామర పువ్వును సమర్పించండి. శివునికి తామర పువ్వును సమర్పిస్తే.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ధన లాభం కోసం శివునికి శంఖు పుష్పాలు, బిల్వ పత్రాలను సమర్పించాలి. ఉమ్మెత్త పువ్వులను శివునికి శ్రావణ మాసంలో సమర్పిస్తే.. నరదృష్టి తొలగిపోతుంది.