సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 23 ఫిబ్రవరి 2019 (17:47 IST)

24-02-2019 నుంచి 01-03-2019 వరకూ రాశి ఫలితాలు.. ముఖ్యమైన పనులకు..(Video)

కర్కాటకంలో రాహువు, వృశ్చికంలో బృహస్పతి, శుక్రుడు, ధనస్సులో శని, రవి, బుధులు, మకరంలో కేతువు, మీనంలో కుజుడు, మీన, మేష, వృషభ మిధునంలలో చంద్రుడు. ముఖ్యమైన పనులకు పంచమి, ఆదివారం శుభదాయకం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆర్థికలావాదేవీలు ముగింపునకొస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. వ్యవహారాలనుకూలత ఉంది. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఆది, గురు వారాల్లో పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఆహ్వానాలు, ముఖ్యమైన పత్రాలు అందుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులకు అభినందనలు తెలుపుతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పట్టుదలకు పోవద్దు. లౌక్యంగా వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం అవసరం. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. సోమ, మంగళ వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. మీ శ్రీమతి వైఖరి అసహానం కలిగిస్తుంది. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇంటి విషాయాల పట్ల మరింత శ్రద్ధ అవసరం. ఊహించని సంఘటనలెదురవుతాయి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. శుభకార్యంలో పాల్గొంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహమార్పు కలిసివస్తుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. జూదాలు, బెట్టింగ్‌ల జోలికి పోవద్దు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొత్త సమస్యలెదురవుతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఓర్పుతో శ్రమించిన గాని పనులు కావు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. సంతానం చదువులపై శ్రద్ధ వహించాలి. బుధవారం నాడు అనవసర జోక్యం తగదు. గృహంలో మార్పులకు అనుకూలం. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పెట్టుబడులకు తరునం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.  
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనులు కార్యారూపం దాల్చుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. రుణ సమస్యలు తొలగుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. గురు, శుక్ర వారాల్లో నగదు, వస్తువులు జాగ్రత్త. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రముఖుల సందర్శనం సాధ్యపడదు. కార్యక్రమాలు వాయిదా పడుతాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఊహించని సంఘటనలెదురవుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రయాణం కలిసివస్తుంది.   
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. ఖర్చులు ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. వృత్తుల వారికి పురోభివృద్ధి. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి.  
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సర్వత్ర అనుకూలతలున్నాయి. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆది, సోమ వారాల్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ద్విచక్ర వాహన చోదకులకు దూకుడు తగదు.    
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలతో హడావుడిగా ఉంటారు. ఖర్చులు విపరీతం. ధనమూలక సమస్యలెదురవుతాయి. సాయం అర్ధించేందుకు మనసు అంగీకరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పట్టుదలతో శ్రమించిన గానీ పనులు పూర్తికావు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. యత్నాలను విరమించుకోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. మంగళ, బుధ వారాల్లో పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. మొహమ్మాటాలు, ఒత్తిళ్లకు లొంగవద్దు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం.  
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. అవకాశాల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. గురు, శుక్ర వారాల్లో దంపతుల మధ్య అవగాహన లోపం. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు. ఆత్మీయుల సలహా పాటించండి. శుభకార్యాలకు హాజరవుతారు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రావలసిన ఆదాయాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. శుభకార్యంలో పాల్గొంటారు. మీ రాక బంధువులకు సంతోషాన్నిస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతరేకులు సన్నిహితులవుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. పందాలు, జూదాల జోలికి పోవద్దు.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు సామాన్యం. ధనలాభం ఉంది. సన్నిహితులకు చక్కని సలహాలిస్తారు. పరిచయాలు విస్తరిస్తాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. ఆశావహ దృక్పథంతో వ్యవహరించండి. ఆరోగ్యం సంతృప్తికరం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రతి చిన్న విషయం ఆందోళన కలిగిస్తంది. మనోధైర్యంతో ముందుకు సాగండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. శనివారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. మీ శ్రీమతివైఖరిలో మార్పు వస్తుంది. సంతానం దూకుడును అదుపు చేయండి. అవివాహితులకు నిరుత్సాహం తగదు. ఆహ్వానాలు, నోటీసులు అందుకుంటారు. గృహమార్పు కలిసివస్తుంది. ప్రముఖుల సందర్శనం సాధ్యపడదు. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలింపు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అకౌంట్స్, మార్కెట్ రంగాల వారికి పనిభారం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ వాక్కు ఫలిస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. అర్థాంతంగా నిలిచిపోయిన పనులు పూర్తి కాగలవు. అనవసర జోక్యం తగదు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆది, మంగళ వారాల్లో పత్రాలు, వస్తువులు జాగ్రత్త. అవివాహితులకు శుభవార్త శ్రవణం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. వ్యాపారాల్లో పురోగతి, అనుభవం గడిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పదోన్నతి. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సంతానం క్షేమం తెలుసుకుంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు. వీడియో చూడండి...