మెడలోనే రుద్రాక్షలు ధరించాలట.. ఎందుకంటే?

సెల్వి| Last Updated: శనివారం, 11 జనవరి 2020 (18:52 IST)
రుద్రాక్షలను ఎవరు ధరించవచ్చు.. ఎవరు ధరించకూడదో తెలుసుకోవాలంటే..? ఈ కథనం చదవాల్సిందే. రుద్రాక్షలను పిన్నలు, పెద్దలు వయోబేధం లేకుండా ధరించవచ్చు. కానీ మొదటిసారి రుద్రాక్షలను ధరించేవారు.. సోమవారం పూట ధరించడం చేయాలి. మిగిలిన రోజుల్లో ధరించాలనుకుంటే... శివాలయాల్లో అభిషేకం నిర్వహించిన తర్వాతే ధరించాలి. రుద్రాక్షలను అంత్యక్రియల్లో ధరించకూడదు.

రాత్రి నిద్రించేటప్పుడు రుద్రాక్షలను ధరించడం నిషిద్ధం. అందుకే రాత్రి నిద్రించేటప్పుడు రుద్రాక్షను తీసి పూజగదిలో వుంచడం, ఉదయం స్నానానికి తర్వాత తిరిగి పంచాక్షరీ మంత్ర పఠనానికి తర్వాత ధరించడం చేయాలి. రుద్రాక్షకు శక్తి ఎక్కువ. కాబట్టి నియమంగా దాన్ని ధరించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. రుద్రాక్షలను ధరించడం ద్వారా మానసిక ఒత్తిడి దూరం అవుతుంది.

రుద్రాక్ష ధారణతో భయాందోళనలు తొలగిపోతాయి. రక్తపోటును నియంత్రించవచ్చు. అంతేగాకుండా హృద్రోగ సంబంధిత రుగ్మతలను తొలగించుకోవచ్చు. రుద్రాక్షలతో కూడిన బ్రేస్ లెట్లు, ఉంగరాల్లా కాకుండా.. మెడలో రుద్రాక్షలను ధరించడం ద్వారానే మంచి ఫలితాలు వుంటాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. రుద్రాక్ష పరమశివుని స్వరూపం.

ఇంకా సప్తముఖ రుద్రాక్ష లక్ష్మీ స్వరూపం. అలాంటి రుద్రాక్షలను చేతి వేళ్ళలో, బ్రేస్ లైట్లలా ధరించడం కూడదు. మెడలో ధరించడం ద్వారా దేవతా స్వరూపంగా భావిస్తున్న రుద్రాక్షతో ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :