మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మే 2023 (19:13 IST)

Shani Jayanti 2023: గజ కేసరి యోగం.. ఆ మూడు రాశుల వారికి అదృష్టం

Lord Shani
శని జయంతికి ముందు చంద్రుడు, బృహస్పతి కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మేషరాశి వారు ఆకస్మిక ధనలాభం పొందుతారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. గజకేసరి రాజయోగం ప్రభావం మిథునరాశి వారిపై అధికంగా కనిపిస్తుంది. సమాజంలో వీరి గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
 
గజకేసరి రాజయోగంలో శనిదేవుడిని పూజించడం వల్ల తులరాశి వారు ఊహించనంత డబ్బు పొందుతారు. అంతేకాకుండా ఆడంబరమైన జీవితాన్ని గడుపుతారు. శని జయంతి రోజున నల్లని బట్టలు ధరించి.. లక్క వస్తువులు, గొడుగుల దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. 
 
అలాగే మినపప్పుతో చేసిన లడ్డూలను, గారెలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా శని శాంతిస్తాడు. ఈ రోజున నిస్సహాయులకు అన్నదానం చేయడం శని గ్రహదోషం నుంచి తప్పించుకోవచ్చు. శని జయంతి రోజున హనుమాన్ చాలీసా కూడా చదవాలి. శని జయంతి రోజున రావి చెట్టు ముందు మొత్తం 9 ఆవాల నూనె దీపాలు వెలిగించాలి. 
 
శని దేవుడికి నల్ల నువ్వులు సమర్పించాలి. ఈ సంవత్సరం శని జయంతి మే 19న వస్తోంది. జ్యేష్ఠ అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు శని పుట్టినరోజుగా జరుపుకుంటారు. 
 
శని జయంతి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇదే క్రమంలో గజకేసరి యోగం, శోభన యోగం, శష్ రాజ్ యోగం కూడా ఏర్పడుతుంది. ఈ గజకేసరి యోగంతో మేషం, మిథునం, తులారాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ ప్రత్యేక యోగాల వల్ల ఖర్చులు తగ్గి, ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.