Happy Mother's Day 2023.. మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు
మాతృత్వం సవాలుతో కూడుకున్నది. కాబట్టి మాతృమూర్తిని గౌరవించే రీతిలో మదర్స్ డేను జరుపుకుంటారు. కుటుంబంలో ఆమె పోషించే పాత్రకు ప్రేమ, ప్రశంసలు, గుర్తింపును చూపించడానికి ఇది ఒక మార్గం. ఈ బంధాన్ని బలోపేతం చేయడానికి, కృతజ్ఞతను చూపేందుకు మదర్స్ డే జరుపుకుంటారు.
తల్లిగా ఓ మాతృమూర్తి కుటుంబం కోసం, పిల్లల కోసం ఆమె చేసే త్యాగాలను గుర్తించే రీతిలో ఈ మదర్స్ డే అనేది ఆచరణలోకి వచ్చింది. ప్రపంచంలోని అనేక దేశాలలో తల్లులు, మాతృత్వాన్ని గౌరవించటానికి జరుపుకునే సెలవుదినం. మాతృమూర్తిల పట్ల తమ ప్రశంసలను వ్యక్తం చేసే రోజుగా ఇది మారింది. తరచుగా బహుమతులు, కార్డులు ఈ రోజున వారికి అందించవచ్చు.
భారతదేశంతో సహా అనేక దేశాలలో, మదర్స్ డే ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం జరుపుకుంటారు. ఈ సంవత్సరం వేడుక మే 14, 2023న వస్తుంది.
మదర్స్ డే చరిత్ర పురాతన కాలం నాటిది అయితే 20వ శతాబ్దం ప్రారంభంలో సెలవుదినంగా మారింది. పురాతన గ్రీకులు, రోమన్లు రియా, సైబెలే వంటి వారు మాతృ దేవతలను గౌరవించే దిశగా ఈ రోజును జరుపుకుంటారు. 16వ శతాబ్దపు ప్రారంభంలో ఇంగ్లాండ్‌లోని క్రైస్తవులు "మదరింగ్ సండే" అని పిలిచే ఈ రోజును జరుపుకునేవారు.
ఇక ఆధునిక మదర్స్ డే, అన్నా జార్విస్ అనే ఒక అమెరికన్ సామాజిక కార్యకర్త చేత నిర్వహించబడింది. 1905లో తన సొంత తల్లి మరణించిన తర్వాత, జార్విస్ తల్లులను గౌరవించటానికి జాతీయ సెలవుదినాన్ని ఏర్పాటు చేయాలని ప్రచారం చేసింది. ఎందుకంటే వ్యక్తులు వారి తల్లులపై వారి ప్రేమ, కృతజ్ఞతలను వ్యక్తపరచడానికి ఒక రోజును రూపొందించాలని ఆమె డిమాండ్ చేసింది.
ప్రపంచంలోని వివిధ దేశాలు మదర్స్ డేని స్వీకరించాయి. 1914లో, ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ యునైటెడ్ స్టేట్స్‌లో మే నెలలో రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా పేర్కొంటూ ఒక ప్రకటనపై సంతకం చేశారు. అప్పటి నుంచి మదర్స్ డేను ఆచరించడం వాడుకగా వచ్చింది.
తల్లులు తమ పిల్లలపై చూపే అపారమైన ప్రభావాన్ని గుర్తించడానికి ఈ రోజు ఒక అవకాశంగా మారింది. మదర్స్ డే తల్లులు అందించే ప్రేమ, సంరక్షణ, పోషణ వంటి ఇతరత్రా నిస్వార్థ చర్యలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి అంకితమైన క్షణాన్ని అందిస్తుంది.
ఈ రోజున కుటుంబంతో కలిసి ప్రత్యేక భోజనం చేయడం, కుటుంబ విహారయాత్రకు వెళ్లడం లేదా తల్లులను గౌరవించడం కోసం చిన్న సమావేశం లేదా పార్టీని నిర్వహించడం వంటివి చేయొచ్చు. వారికి ఇష్టమైన బహుమతులు, కార్డులు, సర్ ప్రైజ్ పార్టీలు ఇవ్వడం చేయొచ్చు. మరి ప్రపంచంలోని మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు.