గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 మే 2023 (22:42 IST)

ఐపీఎల్ మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు- బ్రావోను అధిగమించిన చాహల్

Yuzvendra Chahal
Yuzvendra Chahal
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 2023లో భాగంగా గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత ఆడిన కోల్‌కతా జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. రాజస్థాన్‌ తరఫున అద్భుతంగా బౌలింగ్‌ చేసిన స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ 4 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా రికార్డు సృష్టించాడు. 
 
గురువారం మ్యాచ్ ప్రారంభానికి ముందు, యుజ్వేంద్ర చాహల్, డ్వేన్ బ్రావో 183 వికెట్లతో ఐపిఎల్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. నేటి మ్యాచ్‌ 11వ ఓవర్‌లో కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా వికెట్ తీసిన చాహల్.. బ్రావోను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత మరో 3 వికెట్లు తీశాడు. దీంతో చాహల్ 187 వికెట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. బ్రావో 183 వికెట్లతో రెండో స్థానంలో, పీయూష్ చావ్లా 174 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు.