Dwayne Bravo అదుర్స్.. టీ20ల్లో 600 వికెట్లతో రికార్డ్
వెస్టిండీస్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడైన డ్వేన్ బ్రావో మరో మైలురాయిని చేరుకున్నాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. చరిత్రలో టీ20ల్లో 600 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు. శుక్రవారం ఓవల్ ఇన్విసిబుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత బ్రావో సొంతమైంది.
డ్వేన్ బ్రావో వెస్టిండీస్ తరఫున టీ20ల్లో 91 మ్యాచులకు గాను 78 వికెట్లు తీసుకున్నాడు. మిగిలిన వికెట్లను దేశీయ మ్యాచులతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో లీగ్‌ల తరఫున ఆడి గెలుచుకున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్ లో బ్రావో 25 జట్లకు ప్రాతిధ్యం వహించాడు.