గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 జులై 2022 (22:48 IST)

బ్రిటిష్‌ బౌలర్లకు చుక్కలు.. 28 బంతుల్లోనే ట్రిస్టన్‌ స్టబ్స్‌ 72 పరుగులు

Tristan Stubbs
Tristan Stubbs
బ్రిస్టల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే సఫారీలు ఓడిపోయినా ఆ జట్టు యంగ్‌ ఆల్‌రౌండర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌ మాత్రం బ్రిటిష్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
 
21 ఏళ్ల స్టబ్స్ కేవలం 28 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌‌లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. 235 పరుగుల లక్ష్య ఛేదనలో అతను ఏకంగా 257కు పైగా స్ట్రైక్‌రేట్‌తో రన్స్‌ చేయడం విశేషం. 
 
ఈ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ద్వారా దక్షిణాఫ్రికా తరఫున ఇంగ్లండ్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా స్టబ్స్‌ రికార్డు సృష్టించాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 234 పరుగుల భారీస్కోరు చేసింది.