Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

దేవాలయం వెనుక భాగాన్ని అద్ది నమస్కరిస్తున్నారా?

Written By సెల్వి
Updated: గురువారం, 7 జనవరి 2021 (17:21 IST)
ఆలయానికి వెళ్తున్నారా..? అయితే ఈ కథనం చదవండి. గుడిలో వుండేటప్పుడు గట్టిగా అరవటం, నవ్వటం, ఐహిక విషయాల గురించి మాట్లాడటం చేయకూడదు. గుడి పరిసరాలను పరిశుభ్రంగా వుంచాలి. కొబ్బరి పెంకులూ, అరటి తొక్కలు ఆలయంలో వున్న చెత్త కుండీల్లోనే వేయాలి. అలాగే దర్శనానికి తోసుకుంటూ లేదా ముందున్నవారి అధిగమిస్తూ దర్శనం చేసుకోరాదు. భగవంతుడిని కనులారా వీక్షించాలి. 
 
దేవాలయంలో నిల్చుని తీర్థం పుచ్చుకోవాలి. గృహంలో కూర్చుని తీర్థం పుచ్చుకోవాలి. దీపారాధన శివునికి ఎడమవైపు, శ్రీ మహావిష్ణువుకు కుడి వైపు చేయాలి. అమ్మవారికి నూనె దీపమైతే ఎడమవైపు, ఆవునేతి దీపమైతే కుడి వైపు వెలిగించాలి. చాలా మంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని అద్ది నమస్కరిస్తుంటారు. అలా చేయకూడదు. ఆ భాగంలో రాక్షసులుంటారు. అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదక్షణ చేయాలి. 
 
గుడిలో ప్రదక్షిణల పద్ధతి..?
ధ్వజస్థంభం నుంచి మళ్లీ ధ్వజస్థంభం వరకూ చేస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. అలాగే మందిరమైతే ముఖద్వారం వద్ద నుంచి ప్రారంభించి మళ్లీ మందిర ముఖ ద్వారం వద్దకు వస్తే ఒక ప్రదక్షిణ పూర్తి అయినట్లు. హనుమంతుడికి ఐదు, ఏదైనా కోర్కె వుంటే 11, 27, 54, 108 సంఖ్యలతో ప్రదక్షిణం చేస్తే ఫలితం వుంటుంది. నవగ్రహాలకు 3సార్లు లేదా తొమ్మిది సార్లు చేయవచ్చు. అలాగే 11, 21, 27 సార్లు బేసి సంఖ్యలో చేయవచ్చు.

అన్నీ చూడండి

పోలీసులతో వాగ్వాదం.. కోపంతో బైకుకు నిప్పెట్టిన వ్యక్తి

కువైట్ నుంచి స్వగ్రామానికి మహిళ.. భర్త అంత్యక్రియల కోసం..

తల్లి కోసం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలను పరుగు పెట్టి దర్శనం, వీడియో

మమతా బెనర్జీని హత్య చేసేందుకు కత్తితో దూసుకొచ్చిన మహిళ...

వలచిన బీహార్ యువకుడి కోసం వచ్చేసిన రష్యా బ్యూటీ, అదే జరుగుతుంది, వీడియో

అన్నీ చూడండి

14-10-2026.. బుధవారం మీ రాశి ఫలాలు... ధన వ్యవహారాల్లో జాగ్రత్త..

Navratri Akhand Jyothi: నవరాత్రులు.. అఖండ జ్యోతిని ఎందుకు వెలిగించాలి.. ప్రయోజనాలేంటి?

13-10-2026 నాటి రాశి ఫలాలు - ధన సంబంధిత విషయాల్లో క్రమశిక్షణ అవసరం

12-10-2026 సోమవారం రాశిఫలాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పందెపు పోటీల్లో విజయం...

11-10-2026 ఆదివారం మీ రాశి ఫలాలు - ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments