సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 4 జనవరి 2021 (17:08 IST)

కన్నీరు పెట్టుకున్న సాధినేని యామిని, ఏమైంది?

సాధినేని యామిని అంటే అందరికీ గుర్తుకువచ్చేది టిడిపినే. తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో ఈమె చేసిన హడావిడి అంతాఇంతా కాదు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఆ తరువాత బిజెపిలో చేరారు. అప్పటి నుంచి కనిపించడం మానేశారు. ఎక్కడా కార్యక్రమాలకు హాజరు కాకుండా ఇంటిలోనే ఉండిపోయారు యామిని.
 
అయితే తాజాగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై తీవ్రంగా స్పందించారు సాధినేని యామిని. ప్రతి గుండెల్లో కూడా హిందూ జ్యోతి అఖండ దీపమై ముష్కరులను దహించి వేయాలని.. అవమానం జరిగిన చోటే ఒక మహా సంకల్పానికి బీజం పడలాన్నదే తన కోరికని చెప్పుకొచ్చారు.
 
రామతీర్థం ఘటన సాధారణ విషయం కాదని... వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 126 దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. హిందూ సనాతన ధర్మం లేదు.. హిందువులు చచ్చిపోయారని చాలామంది అనుకుంటున్నారు. మేము ఆగ్రహిస్తే ఇక అంతేసంగతులంటూ భావోద్వేగానికి లోనై తీవ్రంగా కన్నీంటి పర్యాంతమయ్యారు సాధినేని యామిని.