1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. The ultimate benefits of fasting on purnima

పౌర్ణమి వ్రతంతో శరీరానికి ఎంత మేలో తెలుసా? (video)

fasting on purnima
పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువునే కాదు.. కుమార స్వామిని, దత్తాత్రేయ స్వామిని, బుద్ధుడిని ఆరాధించడం ద్వారా శుభాలు కలుగుతాయి. పూర్ణిమ రోజున చేసే పూజలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయి. పూర్ణిమ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి. ఈ రోజున శివకేశవులను పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఉపవాసం వున్నవారు ఉప్పులేని ఆహారాన్ని తీసుకోవాలి. సూర్యోదయానికి ముందు ఉపవాసం ఆచరించి.. సూర్యాస్తమయానికి తర్వాత వ్రతాన్ని విరమించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాక పూజను ముగించాలి. పౌర్ణమి రోజున పూజతో సానుకూల ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. పౌర్ణిమ పూజతో శరీర మెటబాలిజం నియంత్రించవచ్చు. 
 
అలాగే శరీరంలో ఆమ్లాల శాతాన్ని తగ్గించవచ్చు. జీర్ణ వ్యవస్థను శుద్ధీకరించవచ్చు. పౌర్ణమి పూజలతో, ప్రార్థనలతో, ఉపవాసంతో శరీరం మొత్తాన్ని పునరుత్తేజపరుచవచ్చునని.. సుఖసంతోషాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

 
తర్వాతి కథనం
తులసి చుట్టూ పురుషులు ప్రదక్షణ చేస్తే...?