గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (20:15 IST)

ఎస్పీ బాలు ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్

కరోనా వైరస్ బారినపడి పోరాడుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ మేరకు ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం ఎస్పీ బాలును ప్రత్యేక ఐసీయూ వార్డులో ఉంచి వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స చేస్తున్నారు. ఈ మేరకు ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ అనురాధ భాస్కరన్ తెలిపారు. 
 
బాలు స్పృహలోకి వచ్చారని, వైద్యానికి స్పందిస్తున్నారని బులెటెన్‌లో పేర్కొన్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిని వైద్యబృందం సునిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఈ నెల 5వ తేదీన కరోనా వైరస్ బారినపడటంతో బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి చేరిన విషయం తెల్సిందే. అప్పటినుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు, ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.