సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (22:10 IST)

గ్రేప్స్ బ్యూటీ... ద్రాక్ష పండ్లతో అందంగా

ద్రాక్షలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సూర్యుని కఠినమైన కిరణాల నుండి రక్షణను ఇస్తాయి. ఎండకు వెళ్లినప్పుడు ముఖచర్మం కమిలినట్లనిపిస్తే కొన్ని ద్రాక్ష పండ్లను తీసుకుని వాటి రసాన్ని ముఖం చర్మంపై సున్నితంగా మర్దన చేస్తే చాలు చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
 
ద్రాక్షలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వృద్ధాప్య ప్రక్రియను తిప్పికొట్టడంలో సహాయపడతాయి. ఇది మీ చర్మాన్ని కూడా టోన్ చేస్తుంది. రసాయన యాంటీ ఏజింగ్ క్రీములకు బదులు ద్రాక్ష పళ్లను ఉపయోగించి చూడండి, మీకే తెలుస్తుంది.
 
సుమారు 20 విత్తన రహిత గుజ్జు తీసుకొని మీ ముఖానికి రాయండి. సుమారు 15-20 నిమిషాలు మెత్తగా మసాజ్ చేయండి. ఆ తర్వాత నీటితో కడగాలి. ఇలా ద్రాక్ష రసాన్ని వీలున్నప్పుడల్లా ఉపయోగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.