బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (21:44 IST)

చింతపండు రసంలో నిమ్మరసం-తేనె కలిపి అలా చేస్తే...?

చింతపండులో పులుపు ప్రధానంగా వుంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకు చింతపండును ఎలా ఔషధంగా వినియోగించుకుని ఆ సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకుందాం. 
 
చింతపండుని తగినన్ని వేడి నీటిలో వేసి కొద్దిసేపు నానబెట్టి మిక్సీలో వేసి పేస్టులా చేసి వివిధ వ్యాధులకు ఉపయోగించుకోవచ్చు. ఈ పేస్టులో కొద్దిగా ఉప్పు కలిపి కొండనాలుకపై అంటిస్తే కొండనాలుక వాపు తగ్గి దానివల్ల వచ్చే దగ్గు తగ్గుతుంది. అలాగే ఈ పేస్టులో సగం బెల్లం, పావుభాగం పసుపు పొడి కలిపి నడుముపై పట్టులా వేసి గంటసేపు ఆగి కడిగేస్తే నొప్పి తగ్గుతుంది. అలాగే మోకాళ్ల నొప్పులు, బెణుకు నొప్పులు కూడా తగ్గుతాయి. 
 
చింతపండు పేస్టులో తగినంత నిమ్మరసం, తేనె కలిపి ముఖంపై నల్లటి మచ్చలు, మంగుపై పట్టులా వేసి అర్థగంట తర్వాత కడిగేస్తే బ్లాక్ స్పాట్స్ తగ్గిపోతాయి.