గంధం నూనె ఉపయోగాలు ఏమిటో తెలుసా?
సాంప్రదాయ ఔషధాలలో గంధపు నూనెను క్రిమినాశక, రక్తస్రావ నివారిణిగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు దీనిని తలనొప్పి, కడుపు నొప్పి, మూత్ర మరియు జననేంద్రియ రుగ్మతల చికిత్స కోసం ఉపయోగిస్తారు. చందనం నూనెను చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఇంకా దీని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
పాలతో గంధాన్ని అరగదీసి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. మంచి గంధం అరగదీసి రోజు రెండుసార్లు, మూడుసార్లు ముఖానికి రాసుకుంటే మొటిమలు పోతాయి. స్నానం చేసే నీళ్లలో గంధం నూనె అయిదారు చుక్కలు వేసుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావు. శరీరం సునాయాసంగా ప్రెష్‌గా వుంటుంది.
చందనాది తైలం వల్ల తలనొప్పి కళ్లు మంటలు తగ్గుతాయి. వేడి చేసి పిల్లలకు కురుపులుగా వస్తే గంధం అరగదీసి రాస్తే కురుపులు తగ్గుతాయి. గంధాన్ని అరగదీసి కళ్లమీద రాసుకుంటే కళ్ల ఎరుపులు, మంట తగ్గుతాయి. రోజ్ వాటర్‌లో గంధం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం మీద రాష్ వుంటే పోతుంది.