శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (19:32 IST)

తల మీద కాకి రెట్ట వేస్తే ఏం జరుగుతుంది?

శకునాల గురించి ఆదికాలం నుంచే విశ్వాసాలున్నాయి. వాటిలో కాకి శకునం ఒకటి. ప్రయాణమై మనం వెళ్తున్నప్పుడు కాకి అరుస్తూ ఎదురుగా వచ్చిందంటే ఆ కార్యం విఫలమవుతుంది. కాకి తొలుత ఎడమ వైపున ఆ తర్వాత కుడి వైపున అరుచుకుంటూ వెళితే దొంగల భయం వున్నట్లు.
 
వెనుకవైపు చేరి అరిస్తే ధన లాభం కలుగుతుంది. ఎడమ భాగాన అరిచి ఎదురుగా వస్తే మార్గమధ్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఐతే ఇది బాటసారులు కానివారికి శుభ శకునముగా తెలుపబడి వుంది. కాకి ఎదురుగా అరిచి కుడివైపుగా వెనుక నుంచి వెళ్తే ప్రాణ భయం వున్నట్లు చెప్తారు. 
 
తల మీద కాకి రెట్ట వేస్తే కార్య జయం కలుగుతుంది. భోజన ప్రాప్తి కలుగుతుంది. మేత కానీ, కట్టెలు కానీ ముక్కున కరుచుకుని ఎడమ నుండి కుడిప్రక్కకు వెళ్తే కార్యజయం కలుగుతుంది. కాకినోట మరో కాకి ఆహారం పెట్టేటపుడు చూస్తే సౌఖ్యం కలుగుతుంది.