వైకుంఠ ఏకాదశి ముహూర్తం.. పూజా సమయం.. ఎప్పుడంటే?
వైకుంఠ ఏకాదశి వ్రతాన్నిఈ ఏడాది జనవరి రెండో తేదీన జరుపుకుంటారు. ముక్కోటి ఏకాదశి తిథి జనవరి 1వ తేదీ ఆదివారం సాయంత్రం 7.12 గంటలకు ప్రారంభమవుతుంది. జనవరి 2వ తేదీ సోమవారం రాత్రి 08.24 గంటలకు ముగియనుంది. జనవరి 3వ తేదీ ఉదయం 07.12 గంటల నుంచి ఉదయం 09.20 గంటల వరకు పుత్రదా ఏకాదశి వేడుకలను జరుపుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి కంటే ముందే నిద్ర లేచి స్నానం చేయాలి.
ఉపవాస వ్రతం ప్రారంభించి.. మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. ఏకాదశి మరుసటి రోజున అవసరంమైన వారికి ఆహారం అందించాలి. వైకుంఠ ఏకాదశి అన్ని ఏకాదశిలలో అత్యంత పవిత్రమైనది. ఈ రోజును హరి తన భక్తులకు దర్శనం ఇచ్చే రోజుగా చెబుతారు.
వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుండి బయటకు వస్తే 7 జన్మలలో చేసిన పాపాలు పరిష్కారమవుతాయని విశ్వాసం.ఈ ఏకాదశిని స్వర్గ వతిల ఏకాదశి అని కూడా అంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ రోజున దక్షిణాయనంలో నిద్రించిన విష్ణువు ఉత్తరాయణంలో మేల్కొంటాడు. అలాగే మూడు కోట్ల దేవతలకు దర్శనం ఇస్తారని చెబుతారు. కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు.