1. ఆధ్యాత్మికం
  2. »
  3. భవిష్యవాణి
  4. »
  5. పంచాంగం
Written By Selvi
Last Updated : శనివారం, 31 మే 2014 (18:53 IST)

ఉదయం లేచిన వెంటనే అద్దం చూడకూడదట!

ఉదయం లేచిన వెంటనే ఆ రోజంతా శుభప్రదంగా గడిచిపోవాలనుకుంటాం. అందుచేత తెల్లవారు లేవగానే...
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి 
కరమూలే స్థితాగౌరి ప్రభాతే.. అన్నట్లు కరదర్శనం చేయాలి. చేయి పైభాగాన లక్ష్మీ, మధ్యభాగమున సరస్వతి, చివరిభాగమున గౌరీదేవి వున్నందున ప్రాతః కాలమున ఈ శ్లోకం చదివి మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవాలి. లేదా మూడుసార్లు శ్రీహరి, శ్రీహరి శ్రీహరి అని తలస్తూ కరదర్శనం చేసుకుంటే ఆ రోజంతా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా ఉదయం లేవగానే సుమంగళినీ, గోవునూ, వేదవేత్తనూ, అగ్నిహోత్రాన్ని చూసిన శుభఫలము కలుగుతుంది. నది, సముద్రం, సరస్సులు చూస్తే దోషాలు పోతాయి. పెరుగు, నెయ్యి, ఆవాలు, అద్దం చూస్తే అశుభంగా తలుస్తారు. ఇక ఉదయం లేవగానే పదిదోసిళ్ళ నీరు త్రాగితే మంచిది. 
 
అలా చేయటం వల్ల నిత్యం యవ్వనంతో ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళకీ, పిల్లలకి ఉదయాన్నే నీళ్ళు తాగటం అలవాటు చేస్తే వారు జీవితాంతం అజీర్తి, మూత్రపిండాల వ్యాధులతో బాధపడకుండా ఉండగలుగుతారు. రాగి చెంబుతో నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.