ప్రతికూల శక్తులకు చెక్ పెట్టే.. ఉప్పు, మిరపకాయలు.. ఎలా?

Sea salt remedie
సెల్వి| Last Updated: బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (15:44 IST)
remedie
గృహంలోని ప్రతికూల శక్తులకు చెక్ పెట్టేలా.. ఉప్పు, మిరపకాయలు పనిచేస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఆదాయం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం.. అనారోగ్య సమస్యలు వేధించడం వంటివి ప్రతికూల శక్తులకు సూచనప్రాయం. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే.. రాళ్ల ఉప్పును వినియోగిస్తే సరిపోతుంది.

రాళ్ల ఉప్పు, నాలుగు ఎండు మిరపకాయలు, ఒక నిమ్మపండు, ఒక గాజు బౌల్ తీసుకోవడం మంచిది. ఈ పరిహారాన్ని మంగళవారం పూట చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఒక గాజు బౌల్‌లో రాళ్ల ఉప్పును నింపి.. ఒక నిమ్మపండును రాళ్ల ఉప్పుపై వుంచాలి. తర్వాత నాలుగు ఎండుమిర్చిల ఉప్పుకు నాలుగు వైపులా నిలబెట్టాలి.

మిరపకాయల చివర్లు ఇంట్లోని ప్రతికూలతను తొలగిస్తాయి. ఇలా వారానికి ఒకసారి చేయడం.. ఆ తర్వాత ఆ ఉప్పును తొలగించడం చేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఉప్పు, మిరప, నిమ్మ పండును ప్రవహించే నీటిలో పారవేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :