శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (15:12 IST)

రోజాకు ఏపీ హోం మినిష్టర్ పదవి రాబోతోందా? సీఎం జగన్ నిర్ణయించారా?

వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఎవరికి వస్తుందనే చర్చలో మొదటి స్థానంలో రోజా పేరు వుండింది. కానీ సామాజికవర్గాల సమీకరణ తేడా కొట్టడంతో రోజాకి మొండిచెయ్యి చూపారు జగన్. దీనితో ఆమెకి ఏపీఐఐసి ఛైర్మన్ పదవి ఇచ్చి బుజ్జగించారు. ఇక ఇప్పుడు రోజాని మంత్రి పదవి వరించే అవకాశం తన్నుకుంటూ వస్తోందట. అది కూడా హోంమంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది. 
 
అది ఎలాగంటే... శాసనమండలి రద్దు చేస్తే అందులో ఎమ్మెల్సీలుగా వున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల మంత్రి పదవులు పోతాయి. కాబట్టి వారి స్థానాల్లో వేరేవారికి.. అంటే ఎమ్మెల్యేలుగా వున్నవారికి పదవులు వస్తాయి. ఆ రకంగా చూసినప్పుడు రోజాకి మంత్రి పదవి దక్కుతుందని చర్చించుకుంటున్నారు.
 
రోజాతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాంకు మంత్రి పదవి ఇచ్చి ఆ స్థానంలో ధర్మానను ఎంపిక చేస్తారని అనుకుంటున్నారు. మరి ప్రచారంలో వున్న వార్త నిజమవుతుందో లోదో చూడాల్సిందే.